Saturday, 29 September 2012

Recipes

వెజిటబుల్ మంచూరియా 
 Carrot తురుము  : 1 cup 
Cabbage  తురుము : 1 cup 
ఉల్లికాడ     : 1/2 టీ స్పూన్ 
వెల్లుల్లి రేకులు : 2
పచ్చిమిర్చి : 1
నూనె : తగినంత 
మొక్కజొన్న పిండి : 2 టేబుల్ spoons 
సోయా Sauce  : 1/2 టేబుల్ spoons 
చక్కెర : 1/2 టీ స్పూన్ 
మిరియాల పొడి : 1/2 టీ స్పూన్ 
అజినో మాటో : చిటికెడు 
ఉప్పు : తగినంత 

 తయారు చేసే విధానం :  పచ్చి మిర్చి, ఉల్లి కాడ ను సన్నగా తరుక్కోవాలి. తరువాత ఒక వెడల్పాటి పాత్రలో Carrot తురుము, cabbage తురుము, పచ్చి మిర్చి లో సగం, మొక్క జొన్న పిండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేయాలి. 
కడాయిలో నూనె పోసి వేడి అయిన తర్వాత తయారు చేసిన బాల్స్ ని అందులో వేసి దోరగా వేయించుకొని, పక్కన తీసి పెట్టుకోవాలి. మరొక కడాయి తీసుకొని 2 టేబుల్ spoons నూనె వేసి వేడెక్కిన  తర్వాత వెల్లుల్లి, మిగిలిన పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లికాడ ముక్కలు వేసి సన్నని మంట మీద మగ్గనివ్వాలి. అవన్నీ మగ్గిన తర్వాత కొద్దిగా నీటిని వేసి అందులో ఉప్పు, అజినోమోటో, మిరియాల పొడి, సోయా Sauce, చక్కర వేసి సమంగా కలిపి ఉడికించాలి. తర్వాత ఒక టేబుల్ spoon మొక్క జొన్న పిండిని చన్నీటిలో కలిపి ఉడుకుతున్న మిశ్రమంలో పోసి మరవనివ్వాలి. అన్నీ కలిపి చిక్కబడిన తరువాత ముందుగా వేయించి ఉంచిన బాల్స్ ను వేసి సన్నని మంట మీద మూడు, నాలుగు నిమిషాలసేపు ఉడికించి దించాలి. చివరగా సన్నగా తరిగిన కొతిమీరతో అలంకరించి Serve చేయాలి.
                   

1 comment: