పల్లవి:
ఏ మాయో చేసావే ఓ చెలియా..
ఎదనే హాయిలొ ముంచేసావే నా చెలియా..
ఎపుడూ చూడని కలనే కళ్ళు చూస్తున్నాయా..
నిజమై నిలిచే నిమిషం కోసం వేచున్నాయా..
కదిలే అలలే ఎదలోతుల్లో ఉప్పొంగాయా..
రగిలే ఆశలే నా ఊహల్లో ఊరేగాయా..
మనసంత గాలిలో తేలిపోయెనే ఎందుకే ఈ వేళ..
తనువంత తేలికై తూలిపోయెనే ఇక నిలవనంది నేల.. "ఏ మాయో"
చర 1:
పొద్దు గడవదే హద్దే లేని మనసుకు నిన్ను చూడకుంటే..
నిద్దురుండదే మెరిసే నీలి కళ్ళకు నిన్ను తలచుకుంటే..
నడిచేనా హంసలైన వయ్యారి నడకలో హొయలు చూసివుంటే..
మెరిసేనా మెరుపులైనా చెలి కళ్ళలోనా ఆ వెలుగు చూసివుంటే..
చినుకల్లే చేరావే.. చిరుజల్లై తడిపావే..
గుండెళ్ళో దాగున్నా నా ప్రేమనంతా వరదై కదిపావే.. "ఏ మాయో"
చర 2:
వెన్నెలుండదే జాబిలి చెంత ఎన్నడూ విరిసే నీ నవ్వు చూసిఉంటే..
కూతలుండవే కోకిల గొంతుకెప్పుడూ పలికే నీ మాట పిలుపు వింటే..
గాలైనా మురిసిపోదా నీ పరిమళాల ఆ శ్వాస తాకుతుంటే..
రాయైనా కరిగిపోదా నీ అడుగులోని ఆ సున్నితాన్ని చూస్తే..
మెరుపల్లే కలిసావే.. వలపే కలిగించావే..
బ్రతుకంతా నీతోనే గడపాలనేంత ఆశ రేపావే... " ఏ మాయో"