ప్రియమైన నీకు..
నేను ...నిన్ను చూడక ముందు... నువ్వొక మాములు మనిషివి....
చూసాక ..... ఓ అందమైన జ్ఞాపకానివి ...
నేను ... నిన్ను ఆరాదించక ముందు... నువ్వొక సగటు అమ్మాయివి ....
ఆరాధించాక.... నాలోని ప్రేమ మూర్తివి ...
నేను ....నిన్ను ప్రేమించక ముందు ....నువ్వొక శిలా ప్రతిమవి
ప్రేమించాక..... నా హృదయ దేవతవి...
నేను... నీతో మాట్లాడక ముందు ...నువ్వొక నిశ్శబ్ద సముద్రానివి
మాట్లాడాక .... నువ్వొక అలల సవ్వడివి ....
చూసావా ప్రియా... నీ విలువ నేను ప్రేమించడం లోనే ఉంది...
ఇంత చిన్న విషయాన్నీ నీవెప్పుడు గుర్తిస్తావు ..... ??
నీ నీడ..
No comments:
Post a Comment