Showing posts with label Kishore. Show all posts
Showing posts with label Kishore. Show all posts

Saturday, 16 March 2013

My Poetry (Kishore) - Na kanu reppalalo


ప్రియమైన నీకు...

సడి కాని నా కను రెఫ్పలలో నువ్వే..

సడి ఆపని నా హృదయ సవ్వడి లో నువ్వే..

మాటకు మాటకు మధ్యన మౌనంలో నువ్వే..

మౌనానికి మౌనానికి మధ్యన మాటలలో నువ్వే..

ఎన్నటికీ నిన్ను మరవని నా మనసులో నువ్వే..

నిన్ను మరిస్తే ఆగిపోయే నా ఊపిరిలొ నువ్వే..

చెలీ.. ప్రియా.. అన్నీ నాకు నువ్వే..

నిన్నే సర్వస్వం అనుకున్న నన్ను వదిలివెల్లింది నువ్వే..

నీ నీడ.

My Poetry (Kishore) - నిన్ను చూడక ముందు


ప్రియమైన నీకు..

నేను ...నిన్ను చూడక ముందు... నువ్వొక మాములు మనిషివి.... 

చూసాక ..... ఓ అందమైన  జ్ఞాపకానివి ... 

నేను ... నిన్ను ఆరాదించక ముందు... నువ్వొక సగటు అమ్మాయివి .... 

ఆరాధించాక.... నాలోని ప్రేమ మూర్తివి ... 

నేను ....నిన్ను ప్రేమించక ముందు ....నువ్వొక శిలా ప్రతిమవి 

ప్రేమించాక..... నా హృదయ దేవతవి... 

నేను... నీతో మాట్లాడక ముందు ...నువ్వొక నిశ్శబ్ద సముద్రానివి

మాట్లాడాక .... నువ్వొక అలల సవ్వడివి .... 

చూసావా ప్రియా... నీ విలువ నేను ప్రేమించడం లోనే ఉంది... 

ఇంత చిన్న విషయాన్నీ నీవెప్పుడు గుర్తిస్తావు ..... ??

నీ నీడ..

My Poetry (Kishore ) -Nee swasalanni virithavulena..

a very good expression of feeling by KISHORE




Wednesday, 6 March 2013

My Poetry (Kishore) - మీ నీడ..


నీకు తెలుసు…. నను ఎప్పటికీ కలవలేనని….. 

తెలిసి కూడ మాటలు కలిపావు…!!! 

నీకు తెలుసు….. నను ఎప్పటికైనా ఏడిపిస్తావని…. 
తెలిసి కూడ నవ్వించావు…..!! 

నీకు తెలుసు… నను ఎప్పటికీ తాకలేవని…… 
తెలిసి కూడ కవ్వించావు……!! 

నీకు తెలుసు.. నాకు దూరమౌతావని… 
తెలిసి కూడ ప్రేమించావు….!! 

తెలిసి తెలిసి ప్రెమించావు....

తెలియకుండా దూరమయ్యావు…!!!!!


                  -  మీ నీడ..

Tuesday, 5 March 2013

My Poetry (Kishore) - ప్రతి క్షణం


ప్రతి క్షణం నీ ధ్యాసేల

నా కన్నుల్లో నీ రూపమేల
గాలి తాకిడికి నీ స్పర్శేల
నీడ లో సైతం నీ ఛాయేల
ప్రతీ కాంతి లో నీ మేరుపేల
ప్రకృతిలో నీ సౌందర్యమేల 
నా అధరాలపై అనుక్షణం నీ పేరేల
నీ కొరకై దిగులేల
నీ పై ఇంత తపనేల
నీ ప్రేమకై తపస్సేల
నువ్వు లేని నా జీవితమేల 
నీ పై నాకింత ప్రెమేల
సాక్ష్యం ఆ నింగి ఈ నేల
నీలో మౌనమేల 
నీ హృదయం కరుగదేల



తొలిసారి ప్రేమలో పడ్డ ప్రతీ ప్రేమికుడు / ప్రేమికురాలు పడే తీయని వేదన ఇది అని నా అభిప్రాయం. అవునో కాదో మీరే చెప్పండి.......


 { సఫలమైనా విఫలమైనా తొలిప్రేమ జీవిత కాలం వెంటాడుతూనే ఉంటుంది.. మరచిపోయాం అని అనుకున్నా / చెప్పినా అది అసత్యం }

 - మీ కిషొర్