Showing posts with label Own Lyrics. Show all posts
Showing posts with label Own Lyrics. Show all posts

Monday, 29 July 2013

అమ్మ - Bala

నేనంటూ పుట్టకముందే
బ్రహ్మ నన్ను సృష్టించకముందే
నాపై ప్రేమల చిగురులు మొలచి,
నాకై రోజూ మనసున తలచిన అమృతమూర్తే అమ్మ
నలక నుంచి నవనెలల శిశువుగా ఎదుగుతున్న నా ఆకారంలా
నాటుకున్న ఆ ప్రేమబీజాలు ఇంతై అంతై అనంతమంతై
తన ప్రాణంకన్నా కడుపే తీపని
నరాలు తెగేంత నరకయాతనను
భరించి నను బ్రతికించెను అమ్మ
తెలివి లేని నా పసిప్రాయంలో
కఠినమైన ఈ లోకం సోకని
పదిలమైన తన గుండెగూటిలో
దాచి నన్ను కాపాడెను అమ్మ
ప్రేమను మరిగో,ఆకలి కలిగో కళ్ళు నలచి 
నేనేడ్వక ముందే సాటిలేని తన మమత కలిసిన
రొమ్ముపాలు తాగించెను అమ్మ
నా తప్పటడుగులకు మురిసిపోతూనే
అవి తప్పుడుదారుల పాలవకుండా
గోరుముద్దలలో విలువలు కలిపి ప్రేమతో నాకు పెట్టింది
నా కాలికి గాయం ఐతే తన గుండె రక్తం చిందుతుంది
నా నోట్లో ముద్దలు దిగితే తన ఆకలి తీరిపోతుంది
కోవెలలో దీపం లాగా తన ఆయువు ఆవిరి చేస్తూ
తనకున్నా లేకున్నా,తను తిన్నా తినకున్నా
నాకన్నీ అందిస్తూ,నా బ్రతుకున వెలుగులు నింపి తను ఆనందిస్తుంది
తన చల్లని చూపులనీడలో నిలువెత్తుగా నేను ఎదిగినా 
తన కళ్ళకు మాత్రం నేటికీ, నే పసిబాలుడనే అంటుంది
ఈ లోకం బూటకమైనా, నాకెవరేం కాకుండాపోయినా,
నా మీద నాకు కూడా మమకారం మాయమయ్యినా
నను చేసిన దేవత మాత్రం తన ప్రేమను కురిపిస్తుంది 
నను తన బిడ్డగా పంపిన ఆ దేవుడికి ఋణపడిఉన్నా
నాలా తన ప్రేమ పొందలేకపొతున్నందుకు చూసి జాలి పడుతున్నా.....!
                                                              
                                                                            --- BALA

Tuesday, 26 February 2013

""ఏ మాయో చేసావే""!!!! - by Raghav


పల్లవి:

ఏ మాయో చేసావే ఓ చెలియా..

ఎదనే హాయిలొ ముంచేసావే నా చెలియా..
ఎపుడూ చూడని కలనే కళ్ళు చూస్తున్నాయా..
నిజమై నిలిచే నిమిషం కోసం వేచున్నాయా..
కదిలే అలలే ఎదలోతుల్లో ఉప్పొంగాయా..
రగిలే ఆశలే నా ఊహల్లో ఊరేగాయా..
మనసంత గాలిలో తేలిపోయెనే ఎందుకే ఈ వేళ..
తనువంత తేలికై తూలిపోయెనే ఇక నిలవనంది నేల..   "ఏ మాయో"

చర 1:


పొద్దు గడవదే హద్దే లేని మనసుకు నిన్ను చూడకుంటే..

నిద్దురుండదే మెరిసే నీలి కళ్ళకు నిన్ను తలచుకుంటే.. 
నడిచేనా హంసలైన వయ్యారి నడకలో హొయలు చూసివుంటే..
మెరిసేనా మెరుపులైనా చెలి కళ్ళలోనా ఆ వెలుగు చూసివుంటే..
చినుకల్లే చేరావే.. చిరుజల్లై తడిపావే..
గుండెళ్ళో దాగున్నా నా ప్రేమనంతా వరదై కదిపావే..   "ఏ మాయో"

చర 2:


వెన్నెలుండదే జాబిలి చెంత ఎన్నడూ విరిసే నీ నవ్వు చూసిఉంటే..

కూతలుండవే కోకిల గొంతుకెప్పుడూ  పలికే నీ మాట పిలుపు వింటే..
గాలైనా మురిసిపోదా నీ పరిమళాల ఆ శ్వాస తాకుతుంటే..
రాయైనా కరిగిపోదా నీ అడుగులోని ఆ సున్నితాన్ని చూస్తే..
మెరుపల్లే కలిసావే.. వలపే కలిగించావే..
బ్రతుకంతా నీతోనే గడపాలనేంత ఆశ రేపావే...      " ఏ మాయో"