Showing posts with label Srinu. Show all posts
Showing posts with label Srinu. Show all posts

Sunday, 4 November 2012

My Poetry (Srinu) - బంధం

మనిషి పుట్టుకకు కావలసినది మాతృబంధం...
పెరగడానికి కావలసినది పేగు బంధం...
సంతోషంగా జీవించటానికి కావలసినది స్నేహ బంధం...
ప్రేమని పంచుకోడానికి కావలసినది దాంపత్య బంధం...
మనసు ఆహ్లాదంగా ఉంచడానికి కావలసినది పుత్రబంధం...
కానీ మనిషి పోయేటపుడు వదిలేసేది ....అనుబంధం.

........... Srinu :(

Friday, 2 November 2012

My Poetry(Srinu)- నీకోసం

నిన్ను చూసిన మరుక్షణం,
నాలో తెలియని ఓ పులకింత...
నీకై నడచిన ప్రతిక్షణం,
యెదలో ఒకటే గిలిగింత...
నీ తలపులతో తడిసిన నా హృదయం,
నీ జ్ఞాపకాలతో నిండిన ఈ ఉదయం...
పంచభూతాల సాక్షిగా,
ఉంటా నీకు తోడు నీడగా ...
నా తనువూ, మనసూ అన్నీ నీకే అర్పిస్తున్నా,
నీ లాలనలో ఈ భావనతో నే బ్రతికేస్తున్నా ...
                                                                                                          ....... శ్రీను :)