Showing posts with label Home Decoration. Show all posts
Showing posts with label Home Decoration. Show all posts

Wednesday, 10 October 2012

Ladies Club (for a clean house)


ఇల్లు తళ తళా మెరవాలంటే...
    ఇప్పటివరకు మనం ఇంటిని గదులను అందంగా ఎలా అలంకరించుకోవాలో చూశాం కదా... ఇప్పుడు ఇంటిని శుభ్రంగా ఎలా ఉంచుకోవాలో చూద్దాం. ఇంటిని అందంగా సర్దుకొంటే  సరిపోతుందా?  దానితో పాటు గదులను శుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే. ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయమా అనుకోకండి. ఇల్లు తుడవడం అంటే తడి గుడ్డని అటూ ఇటూ తిప్పేయడం కాదు కదా. శుభ్రంగా ఉండటంతో పాటు, క్రిమి కీటకాలకు కూడా దూరంగా ఉండాలి. దాని కోసం ఈ చిన్న పని చేసి చూడండి చాలు. 

            ఒక Bucket లో సగానికి నీళ్ళు తీసుకోండి. అందులో చిటికెడు ఉప్పు వేయండి. దీని వల్ల ఈగలు, దోమలు రాకుండా ఉంటాయి. క్రిమి కీటకాలు రాకుండా ఉండటానికి ఒక అర స్పూన్ పసుపు కూడా కలపండి. జిడ్డు, దుమ్ము పోవడానికి 4,5 చుక్కలు Shampoo కలపండి. మరింత శుభ్రాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి 2,3 మూతలు Dettol కలపండి. సువాసనలు వెదజల్లడానికి 4,5 చుక్కలు Scent కలపండి. చివరిగా 2 మూతల Phenyle వేయండి.వీటన్నిటినీ నీళ్ళలో కలిపి ఇప్పుడు ఇల్లు తుడవండి. ఇంటిని ఎప్పుడూ రెండు సార్లు తుడుచుకోవాలి. 

           ఇప్పుడు relaxed గా Sofa లో కూర్చొని చూడండి. ఇల్లు ఎంత శుభ్రంగా, ఎంత సువాసనగా ఉంటుందో ...

Ladies Club (Kitchen Room Decoration)

కిచెన్ రూమ్ కి స్పెషల్ డెకరేషన్
కిచెన్ అని తేలికగా తీసిపారేయకండి. రోజులో ఎక్కువ సమయం మనం గడిపేది ఇక్కడే ! కాబట్టి దీన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి .
  • Gas Stove ని ఎప్పుడూ తుడిచి కొత్తదానిలా మెరిసేట్లు చూసుకోవాలి. 
  • Almirah లో సామాన్లు ఒకే రకం సీసాల్లో ఉండేటట్లు చుసుకుంటే బాగుంటుంది.
  • గోడకి ఒక Stand అమర్చుకొని అందులో  Plates చిన్నవి పెద్దవి, spoon లు, glass లు, గరిటె లు ఇలా ఎన్నో అందంగా పెట్టుకుంటే వెతుక్కునే అవసరం లేకుండా ఉంటుంది. 
  • Almirah లో వస్తువులకే కాకుండా వండిన వంటకాలు సర్దుకోడానికి కూడా కొంత స్థలాన్ని కేటాయించాలి. Shelf లకి తోరణంగా పండు మిరపకాయాలని దండ గా గుచ్చి వేలాడదీస్తే colorful గా ఉంటుంది. కాని వాటిని కుళ్ళిపోకుండా ఎప్పటికప్పుడు తాజావి ఉంచుకునే ఓపిక ఉండాలి మరి!
  • Kitchen లో గోడకి వెల్లుల్లిపాయలు దండలా గుచ్చి వేలాడదీస్తే నల్లటి Tiles మీద ఇవి పువ్వుల్లా కనిపిస్తాయి. 
  • Kitchen లో గోడలకి పసుపు లేదా Gold కలర్ paint వేస్తే గది అందంగా కనిపిస్తుంది.

Ladies Club (Dining Room Decoration)

డైనింగ్ రూమ్
డైనింగ్ రూమ్ కి Dining Table ముఖ్యం. విడిగా గది ఉన్న వాళ్ళు Table ని మధ్యలో వేసుకోవచ్చు. స్థలం కలిసి రావాలి అంటే  గోడ పక్కగా వేసుకోవచ్చు.
  • గోడకి పండ్లు, కూరగాయలు ఉన్న Scenery ని అతికిస్తే ఆ room కే అందం వస్తుంది. 
  • Dining Table Size ని బట్టి చిన్నదైనా, పెద్దదైనా తాజా పూలతో ఒక Flower Vase ను పెట్టుకోవాలి. Floating arrangement చేస్తే Dining Table కే అందం వస్తుంది. 
  • Dining Table మీద Dim Light arrange చేసుకుంటే Moon Light డిన్నర్ చేసినట్లుంటుంది. 
  • Almirah లో Juice Set, Tea Set, Tiffin Plates పింగాణీవి అమర్చుకోవాలి. వీటిని కొందరు హాలులో అలంకార  వస్తువులుగా పెడతారు. వీటికి అనువైన స్థలం Dining Room మాత్రమే అని గుర్తించాలి. 
  • ఓ ప్రక్కగా Sink, దాని పక్కన Holder, అందులో రోజూ తాజా Napkin పెట్టడం మర్చిపోవద్దు. Sink పైన అద్దం ఉంటే  మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. 

Sunday, 7 October 2012

Ladies Club (Bed Room Decoration)

బెడ్ రూమ్ భలే ఉందనిపించాలి
          బెడ్ రూమ్ లోకి అడుగు పెట్టగానే మరో లోకంలోకి ప్రవేశించినట్లే ఉండాలి చూడగానే బెడ్ ఆహ్వానించాలి. నిద్ర జోల పాట పాడాలి. 
  • బెడ్ రూమ్ కదా అని బెడ్ ని గది మధ్యలో వేయకండి ఎప్పుడూ బెడ్ కిటికీ పక్కగా ఉండాలి. చల్లని గాలి పలకరిస్తూ ఉండాలి. 
  • ఆ కిటికీ దగ్గర మల్లె తీగను కాని, night queen గాని బయట పాకించారనుకోండి. గది అంతా పరిమళాలు వ్యాపిస్తాయి.
  • గోడకి సముద్రం ఉన్నట్లు paint వేయించుకుంటే సముద్రం పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది. లేదా సముద్రం ఉన్న వాల్ పేపర్ అయినా పర్వాలేదు.
  • బెడ్ రూమ్ లో roof కి artificial sky అమర్చుకుంటే రాత్రి పూట light ఆర్పగానే చుక్కలు చంద్రుడు ప్రత్యక్షమై మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి చూస్తూ హాయిగా నిద్రపోవచ్చు 
  • గదిలో ఒక పక్కగా table, దాని మీద tape recorder, ఒక వైపు మీ జంట photo ఉంటే, చక్కని సంగీతం వింటూ నిద్రపోవచ్చు. ఎప్పుడైనా మీరొక్కరే ఉంటే మీ partner ని గుర్తు చేస్తుంది. 
  • గదిలో ఇంకొక పక్క చిన్న shelf, అందులో మీకు ఇష్టమైన కొన్ని books పెట్టుకుంటే నిద్ర రాకపోతే చదువుకోడానికి బాగుంటుంది. కొంతమందికి book చదువుతూ నిద్రపోయే అలవాటు ఉంటుంది కదా. 
  • ఒక వైపుగా డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే, బెడ్ రూమ్ అందంగా ఉంటుంది. 
  • ప్రణయానికి ప్రతిరూపమైన రాధాకృష్ణ ఫోటోని   wall hanger గా తగిలించండి.
  • bed light ఎరుపుది కాకుండా ఉండాలి. తెలుపు, లేత పసుపు, లేత పచ్చ, లేత నీలం baby pink ఇలాంటి color అయితే బెడ్ రూమ్ ఆకర్షణీయంగా ఉంటుంది. బెడ్ bulb మీద రెండు మూడు చుక్కలు Scent చల్లితే నెమ్మదిగా గది అంతా సువాసనలు వ్యాపిస్తాయి. 
  • Matching pillows తో నలగని bed sheet తో bed ఉంటే చూడటానికి శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. గుమ్మాలకీ, కిటికీలకీ matching curtains ఉంటే అందంగా ఉంటుంది. bed పక్కనే కింద మరియు bed room door దగ్గర కాళ్ళు తుడుచుకునే పట్టా తప్పని సరిగా ఉండాలి. అప్పుడు bed room, bed రెండూ శుభ్రంగా ఉంటాయి.
ఇలా అలంకరించి చూడండి అందమైన ఆకర్షణీయమైన bed room మీ సొంతం.

Ladies Club (Living Room Decoration)

ఆల్ ఇన్ ఆల్ రూమ్
 హాలు అనండి ముందు రూము అనండి. డ్రాయింగు రూము అనండి. ఏదైనా ఇదే !
  • గదిలోకి రాగానే ఆహ్వానిస్తున్నట్లు ఒక WELCOME BOARD  ఉండాలి. దానికి అటు పక్క ఇటు పక్క మీ ఇద్దరి ఫోటోలు తగిలించండి. అంటే మీ ఇద్దరు కలిసి వచ్చిన వాళ్ళని ఆహ్వానిస్తున్నట్లు అన్నమాట. వాళ్ళు వచ్చిన క్షణం లో మీరు ఎదురుగా ఉండలేరు కదా మరి! ఒక్కొక్కసారి అనుకోకుండా అతిధులు వస్తారు కదా . అలాంటప్పుడు వారికీ మీ ఇద్దరు ఆహ్వానం పలికినట్లు ఉంటుంది. వచ్చిన వాళ్ళ మనసులో తెలీకుండానే ఒక రకమైన సంతోషం కలుగుతుంది.
  • గోడకి నిజంగానే అది వనమేమో అనిపించేలా ప్రకృతి సౌందర్యం ఉండే ఒక సీనరి  (SCENERY) ని తగిలించండి లేదా అంటించండి. 
  • గదిలో ఎక్కడో ఒక చోట ఫ్లవర్ వాజ్ (FLOWER-VASE) ఉంటె బాగుంటుంది. అందులో ఎప్పటికప్పుడు తాజా పూలు ఉంచితే అందరి మనసులని ఆహ్లాదపరుస్తాయి. ఒకవేళ  ప్లాస్టిక్ పూలు  పెట్టినా కూడా  అందంగా సహజంగా ఉందేవాటిని పెట్టండి.
  •  సోఫానా ,కుర్చీలా అన్నది కాదు ముఖ్యం. ఏది వాడినా ఒకే రంగులో ఉండేలా చూస్కుని అందంగా అమర్చుకుంటే చాలు.
  •  ఏ  వస్తువు ఉన్నా లేకపోయినా ఇప్పుడు ప్రతి ఇంట్లో  టి.వి తప్పనిసరిగా ఉంటుంది. టి.వి పైన పెన్ స్టాండ్ (penstand) పెట్టుకోవచ్చు. red  and blue  pens  పెట్టుకుంటే అందంగా ఉంటుంది. అవసరానికి కూడా  ఉపయోగపడుతుంది. మీకు  పెన్ స్టాండ్ పెట్టుకోవడం నచ్చకపోతే ఇంకేదైనా అందంగా ఉండే ఫోటో ఫ్రేం పెట్టుకోండి. అందులో  మీ ఇద్దరి ఫోటో లు మాత్రమే ఉండేలా చూస్కోండి. 
  • కార్నర్స్ లో కానీ , క్రింద కానీ , 3 అరల స్టాండ్ పెట్టండి. పై దాని మీద ఫోన్ , రెండవ అరలో అడ్రెస్ బుక్ , మూడవ అరలో లెటర్ పాడ్ పెట్టుకోండి. అంటే అది కేవలం ఫోన్ కి సంబంధించినది  మాత్రమే అయి ఉండేలా చూస్కోండి. ఇక దాని మీద ఇంకా ఏది పెట్టి ఇరుకు చేయకండి.
  • ఒక పక్కగా తాళాలు (keys) తగిలించుకోడానికి ఒక షో పీస్  (showpiece) పెట్టుకోండి. పియానో లేక తాళం ఆకారం లో మార్కెట్ లో సులభంగా దొరుకుతాయి. 
  • మరొక వైపు ఉత్తరాలు పెట్టుకోవడానికి ఒక స్టాండ్ లేదా సంచి , అందులో రంగురంగుల డిజైన్స్ లో పలకరిస్తున్న గ్రీటింగ్స్ ముచ్చట గొలిపేలా అమర్చండి.
  • ఒక ములగా మూత ఉన్న డస్ట్ బిన్ పెట్టుకోవాలి. అందులో హాల్ కి సంబంధించిన డస్ట్ మాత్రమే వేయండి. కిచెన్ డస్ట్ అందులో వేయకండి. దుర్వాసన వస్తుంది కిచెన్ లో వేరేగా డస్ట్ బిన్ ఏర్పాటు చేస్కొండి. ప్రతి రూం లో ఒక డస్ట్ బిన్ చిన్నది ఏర్పాటు చేస్కుంటే శుభ్రంగా ఉంటాయి రూమ్స్ అన్ని. పనిమనిషికి లేదా మనకి కూడా సులభంగా ఉంటుంది ఇల్లు శుభ్రం చేస్కొడానికి. 
  • కార్పెట్ పరుచుకుంటే  గదికి మరింత అందం వస్తుంది. డార్క్ కలర్స్ లో ఉండే కార్పెట్స్  అయితే దుమ్ము ధూలి  పడిన అంత తొందరగా కన్పించడు , మాసిపోదు. వీలున్నంత వరకు మెత్తగా ఉండే కార్పెట్స్  అయితే కాలు పెట్టగానే హాయిగా అనిపిస్తుంది.
ఇలా అలంకరించుకుంటే మన ఆల్ ఇన్ ఆల్ రూమ్ చక్కగా కనువిందు చేస్తుంది . ఇవన్ని కేవలం సూచనలు మాత్రమే......

Ladies Club (Main Door Decoration)

కమ్మని సంగీతంతో కాలింగ్ బెల్ 
అతిధులు మన ఇంటికి వచ్చినప్పుడు ముందుగా కాలింగ్ బెల్ నొక్కుతారు. మనం ఇంట్లో  ఏదో పనిలో ఏదో గదిలో ఉంటాం కాబట్టి వచ్చి తలుపు తీయడానికి కనీసం రెండు నిమిషాలన్నా .పడుతుంది. ఆ  రెండు నిమిషాలు కూడా అతిధులకి ఆనందాన్ని ఇవ్వవలసిందేగా మరి! కాలింగ్ బెల్ వచ్చిన వారితో కాసేపు కబుర్లు చెప్పాలి. దీని కోసం ఒక మంచి పాత లేదా ఒక చక్కని సంగీతం వారికి వీనుల విందు చేసే ఏర్పాటు చేయాలి. ఆ  సంగీతాన్ని  అనుభవిస్తూనే గుమ్మాన్ని కూడా గమనిస్తారు కాబట్టి దాన్ని కూడా  చక్కగా అలంకరించి ఉండాలి ఎప్పుడూ. 
లేత ఆకుపచ్చ  GREETING CARD తీసుకొని దాని మీద మామిడి ఆకులు వేసి కట్ చేసి వాటిని గుమ్మానికి తోరణంగా వేలాడదీస్తే అందం వదలవు , చెదరవు , చిరగవు కూడా ! ఎందుకంటే ప్రతి ఆకుకూ  ప్లాస్టిక్ WRAPPER  తో  కవరేజ్  ఉంది. ఎంత అద్భుతమైన ఆలోచన ! ఎంత NATURALITY! అంత టైం మన దగ్గర సాధారణంగా ఉండదు కాబట్టి మార్కెట్ లో READYMADE తోరణాలని కూడా కట్టచ్చు.కానీ అందంగా చూడగానే కట్టిపడేసేవి కొనండి. మీ ప్రతి ఆలోచన ఇలాగే వెరైటీ గా ఉంటె ఇంటి అందం , అతిధుల మరియు మీ శ్రీవారి మెచ్చుకోలు మీ సొంతమేగా మరి! 
ఇది ఉదాహరణ మాత్రమే . మనకు ఉన్న సమయాన్ని బట్టి మనం అందంగా అలంకరించుకుంటే చాలు.

Ladies Club (Introduction to Home Decoration)


               ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని ఒక సినీ  కవి చెప్పాడు. అది అక్షరాలా నిజం. ఇల్లాలు తన జీవితపు ప్రమిద లో విజ్ఞానపు నూనె వేసి చిట్కాల వత్తులను వెలిగిస్తే ఇళ్ళంతా దీపావళి  సంబరమే. నిత్యం వెలుగుల పండగే. అలాంటి దీపాల వెలుగులను మరువ లేని అనుభూతిగా అందుకోవాలంటే ముందు మూడు ఆణిముత్యాల గురించి తెలుసుకోవాలి. అదే...అందం...ఆనందం...ఆరోగ్యం. ఈ మూడు మన దగ్గర ఉంటే  చాలు. అయితే ఇది శరీరానికా, మనసుకా, ఇంటికా అన్నది ప్రశ్న.  ఇంకెందుకు ఆలస్యం ...సమాధానం వెతికేద్దాం పదండి...

ఇంటిని ఇల్లాలిని ఒకే సారి చూద్దాం
              ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నది ఆనాటి మాట. ఇంటిని ఇల్లాలిని ఒకేసారి చూడమన్నది ఈనాటి మాట. ఎందుకంటే ఇల్లు , ఇల్లాలు రెండూ ఒక దానితో ఒకటి పోటీ పడుతుంటాయి మరి! అందులో ఎవరు నెగ్గాలి? ఎవరు నెగ్గినా ఇద్దరు గెలిచినట్టే! 

                పొదరిల్లు లాంటి ఇల్లు... అది చిన్నదైనా, పెద్దదైనా, గుడిసె అయినా, బంగారపు ఇల్లు అయినా ఇల్లు ఇల్లే ! ఇల్లాలే ఆ గృహ సామ్రాజ్యానికి మహా రాణి. అలాంటి ఇంటిని ఎలా సర్డుకుంటే మంచి అందం వస్తుంది అని తెలుసుకుంటే  పని సులభం అయిపోతుంది.

           మనుషుల్లో బీద గొప్ప లాగ, ధనార్జన లో ఎక్కువ తక్కువ లాగ ఇంటి సదుపాయాల్లో కుడా తేడాలు ఉంటాయి. అందరికీ లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, గెస్ట్ రూమ్ లు ఉండకపోవచ్చు. అన్ని కలిపి ఒక్క 'హాల్' అవ్వొచ్చు. ఇంకా చెప్పాలి అంటే హాల్ కమ్  డైనింగ్ కూడా అవ్వొచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాగే కదా ఉంటున్నాయి ! కాబట్టి ఎన్ని రూమ్స్ అన్నది కాదు ఎంత కళాత్మకంగా ఉంచుకున్నామన్నది ప్రశ్న.

          ఎన్ని వేలు ఖర్చు చేశామన్నది కాదు ఎంత అందంగా సర్దుకున్నాం, ఎంత ఆనందాన్ని మన కళ్ళలో నింపుకున్నాం అన్నదే ముఖ్యం. ఈరోజున బజారులో ఒక వస్తువు అయిదు రూపాయలు నుంచి యాభై వేల రూపాయల వరకు దొరుకుతుంది. కాబట్టి ఎంత ఖర్చు పెట్టామన్నది కాకుండా ఎంత తక్కువ ఖర్చులో ఎంత ఎక్కువ అందాన్ని తీసుకు రాగాలమో చూసుకోవాలి. ధనవంతులైతే ఇంటీరియర్ డెకరేటర్స్ ని పిలిచి ఇంటిని తీర్చిదిద్దుకుంటారు. కాని మధ్య తరగతి మహిళ ఉన్నంతలో పొడుపును పాటిస్తూ వీలైనంత వరకు తక్కువ ఖర్చు చేస్తూ అవకాసం ఉన్నంత వరకూ అందంగా ఇంటిని తీర్చిదిద్దుకోవచ్చు. అదెలానో చూద్దాం...