Showing posts with label Ladies Club. Show all posts
Showing posts with label Ladies Club. Show all posts
Saturday, 30 August 2014
Tuesday, 28 January 2014
Tips - Hair and Dandruff
Drink fresh palak juice (Palakura Rasam) or coreander juice (kothimeera rasam) at least once a day for 3 or 4 weeks regularly, you can avoid hair fall.
Grind the roots of jasmine plant with lemon juice and apply the paste to the scalp, wash after half an hour. no grey hair now.
Dont tempt for the advertisements on TV and for those shampoos available in market. Use natural soapnut (kumkudu kaya) and Seekai Juice for your head bath and avoid dandruff and hair fall. If you dont have the time to use all these and you are forced to use shampoos, go for herbal shampoos.
If you have hairfall due to dandruff, burn some coconut pieces and powder them. Apply the powder daily on that particular damaged part of your scalp, you will get hair again.There are some herbal oils also for this, select a right one.
Keep some neem leaves in water and boil it. Have head bath with that water to prevent dandruff.
You can mix some lemon juice with coconut oil and apply to prevent dandruff.
Beat egg yolk and apply to the scalp. Leave it for 2 hours and wash to get rid of dandruff. You can apply curd also instead of egg yolk.
Apply glycerin to the scalp and massage well. Leave it for 4 or 5 hours. then have a head bath. dandruff never troubles you.
Saturday, 30 March 2013
Friday, 15 March 2013
Saturday, 9 March 2013
Wednesday, 23 January 2013
Wednesday, 10 October 2012
Ladies Club (For a happy family)
కుటుంబం కళకళలాడాలంటే...
- కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ తప్ప ద్వేషాలకు తావు ఇవ్వకూడదు. కలహం అనే మాటని అసలు రానివ్వకూడదు.
- అనుబంధాలను తుంచేయాలని ప్రయత్నించే వారిని ఎవరినైనా సరే దూరంగా ఉంచాల్సిందే...అది ఇరుగు పొరుగు వారైనా దగ్గర బంధువులైనా చివరికి సొంత మనుషులైనా...
- తోడికొడళ్ళయినా, అన్నదమ్ములైనా ప్రేమను పంచుకోవడంలో, పెంచుకోవడంలో పోటీ పడాలి కాని ఆస్తిని, వస్తువులని, మనుషులని పంచుకోడానికి కాదు.
- అత్త గారు తన కోడలను ఆదరిస్తే, తన కూతుళ్ళను ఆ ఇంటి కోడలు తల్లిలా అక్కున చేర్చుకుంటుంది.
- ఇంటి ఆడపడుచు కోడలిని గౌరవించి మర్యాదగా చూస్తే, ఆమె ఇంటిని, ఇంట్లో మనుషులని ఎంతో గౌరవిస్తుంది.
- మొత్తం మీద అరమరికలు (Egos and Clashes)మరిస్తే కొంత ఆనందమే...!
Ladies Club (Going to a Party)
పార్టీ కి వెళ్ళేటప్పుడు...?
ఈ రోజుల్లో పార్టీ అనే మాట, పార్టీలకు వెళ్ళడం అనే మాట సర్వ సాధారణమై పోయింది. కిట్టీ పార్టీలు, Office లో పార్టీలు, friends తో బయట పార్టీలు, new year, valentine's day లాంటి occassions కి పార్టీ లు, పెళ్ళిళ్ళు, చిన్న చిన్న function లు ఇలా ఈ రోజుల్లో ప్రతి చిన్న, పెద్ద సందర్భానికి పార్టీ జరుపుకోవడం అనేది అలవాటుగా మారిపోయింది. మనం వెళ్ళే ప్రతీ పార్టీ లో మనం Centre of Attraction అవ్వడానికి ఇష్టపడతాం.దీనికోసం ఆడవాళ్ళకి ఏ చీర కట్టుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా అలంకరించుకోవాలి అనేవి ఒక పెద్ద సమస్య. దానికోసం ఇలా ఒకసారి ఆలోచిద్దాం.
- పార్టీ అనగానే అందరూ భారీ బట్టలతో, భారీ make up తో వస్తారు అనేది వాస్తవం. దానికి భిన్నంగా మీరు simple గా ready అయి వెళితే Centre of Attraction మీరే అవుతారు. Ready అవ్వాలి కాని Ready అయినట్టు కనపడకూడదు.
- మన శరీరం మీద ఉన్న అలంకరణ కంటే మన పెదవుల మీద ఉండే చిరునవ్వే అందర్నీ ఆకర్షిస్తుంది అనేది మర్చిపోకూడదు.
- Centre of Attraction అవ్వాలి అంటే పెద్ద పెద్దగా అరుస్తూ, అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ అందరితో గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉండటం కాదు.మీరు తక్కువ మాటలు మాట్లాడినా, అందులో ఆప్యాయత, పనికోచ్చే విషయం ఎక్కువ ఉండాలి. అప్పుడు automatic గా అందరికి మీరు గుర్తుండిపోతారు.
- ఒకవేళ పార్టీ కి ఏదైనా బహుమతి తీసుకు వెళ్ళాల్సి వస్తే దానిని బయట కొనే కంటే, కొద్దిగా సమయం కేటాయించి, ఆ బహుమతి తీసుకునే వారి ఇష్టా ఇష్టాలను దృష్టిలో పెట్టుకొని మీరే స్వయంగా తయారు చేస్తే, దానికి వచ్చే గుర్తింపే వేరు.ఆ బహుమతిని చూసినపుడు ఎదుటి వారి మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఇట్టే తెలిసిపోవాలి.
- ఇలా ఉంటే ఎక్కడ పార్టీ జరిగినా గుర్తు పెట్టుకొని first invitation మీకే ఇస్తారు.
Ladies Club (Personal Beauty)
ఇల్లాలికి అందం చిరునవ్వే
కష్టపడి లేదా ఇష్టపడి ఇంటిని శుభ్రంగా, అందంగా ఉంచుకుంటే చాలదు. ఆ ఇంటి ఇల్లాలు కూడా శుభ్రంగా, అందంగా ఉండాలి. అందమంటే భారీ makeup తో కొత్త బట్టలు కట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. మనం పాత చీర కట్టినా, ఎంత Simple గా ఉన్నా, మన పెదవుల మీద చిరునవ్వు కదలకుండా ఉంటే మన అంత అందంగా ఎవరూ కనపడరు. ఆ చిరునవ్వే మన ఇంట్లో వాళ్ళని, అథిదులని చక్కగా అలరించి సంతోష పెడుతుంది. అలాంటి చిరునవ్వుని ఎప్పుడూ మన పెదవుల మీద ఉంచుకోవాలంటే మనం ఈ చిన్న జాగ్రతలు తీసుకుంటే చాలు.
- ఈ రోజుల్లో nuclear families అవ్వడం వలన ఇంటి పని అందుకోవడానికి ఇంట్లో ఎవరూ ఉండరు. అందువల్ల పని అంతా మనం ఒక్కరమే చేసుకోవాల్సి వస్తుంది. దాని వలన అలసట వచ్చే మాట నిజమే కానీ ఎవరైనా వచినపుడు ఆ అలసటని కొంచెం పక్కన పెడితే చాలు. పని చేసేటప్పుడు చక్కని సంగీతం వింటూ చేస్తే పని అలసట అంతగా తెలీదు. ఎంత అలసటైనా శరీరానికే కానీ మనసుకి, పెదవులకి కాదు అనే విషయం గుర్తుంచుకుంటే చాలు. అవి ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాయి.
- ఎదుటి వారిలో మనకి చెడు కనిపిస్తున్నా సరే దాన్ని పక్క్కన పెట్టి మంచిని వెతికే ప్రయత్నం చేస్తే మన మనసు కష్టపడకుండా ఉంటుంది. మనసులో ఏ కష్టం లేనపుడు నవ్వుతూ ఉండటం సులభం కదా. అందుకే చెడు మనుషులకు, చెడు ప్రవర్తనలకు దూరంగా ఉండాలి.
- ఇలాలు అంటేనే ఓర్పు కి మంచితనానికి మరొక పేరు కాబట్టి ఒక వేళ ఎదుటి వారు మీరు చేయని తప్పుకి కుడా మిమ్మల్ని నిందిస్తుంటే చిరునవ్వే సమాధానం అవ్వాలి తప్ప వాదించి మనసు కష్ట పెట్టుకోవద్దు, సమయం వృధా చేసుకోవద్దు.
- మన ఏ చిన్న సంతోషాన్ని అయినా ఇంట్లో అందరితో పంచుకుంటే నవ్వులు ఇంకెక్కడికీ వెళ్ళవు. అలాగే ఎదుటి వారు ఎవరైనా తమ కష్టాలని చెప్పుకోవాలని వచ్చినపుడు, నవ్వుతూ వారిని ఆహ్వానిస్తే, వారి మనసులో మీరు కలకాలం ఉండిపోతారు.
- చివరిగా ఒక చిన్న సలహా... మనసును ఎప్పుడూ స్వచ్చంగా ఎలాంటి అరమరికలు లేకుండా ఉంచుకోండి. పిల్లలతో వీలైనంత సమయం గడపండి.ఇలా చేస్తే మనసుకి హాయిగా తేలిగ్గా అనిపిస్తుంది. మనసు తేలిగ్గా ఉంటె పెదవులు కూడా తేలిగ్గా నవ్వుతాయి.
Ladies Club (for a clean house)
ఇల్లు తళ తళా మెరవాలంటే...
ఇప్పటివరకు మనం ఇంటిని గదులను అందంగా ఎలా అలంకరించుకోవాలో చూశాం కదా... ఇప్పుడు ఇంటిని శుభ్రంగా ఎలా ఉంచుకోవాలో చూద్దాం. ఇంటిని అందంగా సర్దుకొంటే సరిపోతుందా? దానితో పాటు గదులను శుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే. ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయమా అనుకోకండి. ఇల్లు తుడవడం అంటే తడి గుడ్డని అటూ ఇటూ తిప్పేయడం కాదు కదా. శుభ్రంగా ఉండటంతో పాటు, క్రిమి కీటకాలకు కూడా దూరంగా ఉండాలి. దాని కోసం ఈ చిన్న పని చేసి చూడండి చాలు.

ఒక Bucket లో సగానికి నీళ్ళు తీసుకోండి. అందులో చిటికెడు ఉప్పు వేయండి. దీని వల్ల ఈగలు, దోమలు రాకుండా ఉంటాయి. క్రిమి కీటకాలు రాకుండా ఉండటానికి ఒక అర స్పూన్ పసుపు కూడా కలపండి. జిడ్డు, దుమ్ము పోవడానికి 4,5 చుక్కలు Shampoo కలపండి. మరింత శుభ్రాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి 2,3 మూతలు Dettol కలపండి. సువాసనలు వెదజల్లడానికి 4,5 చుక్కలు Scent కలపండి. చివరిగా 2 మూతల Phenyle వేయండి.వీటన్నిటినీ నీళ్ళలో కలిపి ఇప్పుడు ఇల్లు తుడవండి. ఇంటిని ఎప్పుడూ రెండు సార్లు తుడుచుకోవాలి.
ఇప్పుడు relaxed గా Sofa లో కూర్చొని చూడండి. ఇల్లు ఎంత శుభ్రంగా, ఎంత సువాసనగా ఉంటుందో ...
ఒక Bucket లో సగానికి నీళ్ళు తీసుకోండి. అందులో చిటికెడు ఉప్పు వేయండి. దీని వల్ల ఈగలు, దోమలు రాకుండా ఉంటాయి. క్రిమి కీటకాలు రాకుండా ఉండటానికి ఒక అర స్పూన్ పసుపు కూడా కలపండి. జిడ్డు, దుమ్ము పోవడానికి 4,5 చుక్కలు Shampoo కలపండి. మరింత శుభ్రాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి 2,3 మూతలు Dettol కలపండి. సువాసనలు వెదజల్లడానికి 4,5 చుక్కలు Scent కలపండి. చివరిగా 2 మూతల Phenyle వేయండి.వీటన్నిటినీ నీళ్ళలో కలిపి ఇప్పుడు ఇల్లు తుడవండి. ఇంటిని ఎప్పుడూ రెండు సార్లు తుడుచుకోవాలి.
ఇప్పుడు relaxed గా Sofa లో కూర్చొని చూడండి. ఇల్లు ఎంత శుభ్రంగా, ఎంత సువాసనగా ఉంటుందో ...
Ladies Club (Kitchen Room Decoration)
కిచెన్ రూమ్ కి స్పెషల్ డెకరేషన్
కిచెన్ అని తేలికగా తీసిపారేయకండి. రోజులో ఎక్కువ సమయం మనం గడిపేది ఇక్కడే ! కాబట్టి దీన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి .
- Gas Stove ని ఎప్పుడూ తుడిచి కొత్తదానిలా మెరిసేట్లు చూసుకోవాలి.
- Almirah లో సామాన్లు ఒకే రకం సీసాల్లో ఉండేటట్లు చుసుకుంటే బాగుంటుంది.
- గోడకి ఒక Stand అమర్చుకొని అందులో Plates చిన్నవి పెద్దవి, spoon లు, glass లు, గరిటె లు ఇలా ఎన్నో అందంగా పెట్టుకుంటే వెతుక్కునే అవసరం లేకుండా ఉంటుంది.
- Almirah లో వస్తువులకే కాకుండా వండిన వంటకాలు సర్దుకోడానికి కూడా కొంత స్థలాన్ని కేటాయించాలి. Shelf లకి తోరణంగా పండు మిరపకాయాలని దండ గా గుచ్చి వేలాడదీస్తే colorful గా ఉంటుంది. కాని వాటిని కుళ్ళిపోకుండా ఎప్పటికప్పుడు తాజావి ఉంచుకునే ఓపిక ఉండాలి మరి!
- Kitchen లో గోడకి వెల్లుల్లిపాయలు దండలా గుచ్చి వేలాడదీస్తే నల్లటి Tiles మీద ఇవి పువ్వుల్లా కనిపిస్తాయి.
- Kitchen లో గోడలకి పసుపు లేదా Gold కలర్ paint వేస్తే గది అందంగా కనిపిస్తుంది.
Ladies Club (Dining Room Decoration)
డైనింగ్ రూమ్
డైనింగ్ రూమ్ కి Dining Table ముఖ్యం. విడిగా గది ఉన్న వాళ్ళు Table ని మధ్యలో వేసుకోవచ్చు. స్థలం కలిసి రావాలి అంటే గోడ పక్కగా వేసుకోవచ్చు.
- గోడకి పండ్లు, కూరగాయలు ఉన్న Scenery ని అతికిస్తే ఆ room కే అందం వస్తుంది.
- Dining Table Size ని బట్టి చిన్నదైనా, పెద్దదైనా తాజా పూలతో ఒక Flower Vase ను పెట్టుకోవాలి. Floating arrangement చేస్తే Dining Table కే అందం వస్తుంది.
- Dining Table మీద Dim Light arrange చేసుకుంటే Moon Light డిన్నర్ చేసినట్లుంటుంది.
- Almirah లో Juice Set, Tea Set, Tiffin Plates పింగాణీవి అమర్చుకోవాలి. వీటిని కొందరు హాలులో అలంకార వస్తువులుగా పెడతారు. వీటికి అనువైన స్థలం Dining Room మాత్రమే అని గుర్తించాలి.
- ఓ ప్రక్కగా Sink, దాని పక్కన Holder, అందులో రోజూ తాజా Napkin పెట్టడం మర్చిపోవద్దు. Sink పైన అద్దం ఉంటే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
Tuesday, 9 October 2012
Tips - Skin
- Drink some lemon juice mixed with honey to remove black spots on your body.
- Take some fresh or dried daisy (chamanthi rekulu) and wrap them in a thin cloth. keep that cloth wrap in your bathing hot water and bathe with that water. you will feel very fresh. If you bathe with cold water, put that daisy in a small tin and heat them, and filter the water into your cold water. bathe with that water. if you do this daily, your skin does not become rough, dry and also it smell fresh and good through out the day.
Tips - Face
- After returning home from sun, wash your face first with cool buttermilk and then with cool water. your face looks so fresh
- Have Pimples? Apply tomato juice on your face and massage for 15 minutes and then wast it. You can do it daily to avoid pimples.
Tips - Mouth
- Chew some thulasi leaves daily to avoid mouth decay.
- Mix sugar candy powder (patika bellam podi) with honey and apply it to your tongue to avoid mouth ulcer and tongue ulcer.
- If you are suffering from frequent heavy sneezes, smell frequently some of the coreander leaves (kothimeera aakulu)
Tips - Eyes
- Applying cow ghee to the feet and massaging them can avoid eye diseases.
Sunday, 7 October 2012
Ladies Club (Bed Room Decoration)
బెడ్ రూమ్ భలే ఉందనిపించాలి
బెడ్ రూమ్ లోకి అడుగు పెట్టగానే మరో లోకంలోకి ప్రవేశించినట్లే ఉండాలి చూడగానే బెడ్ ఆహ్వానించాలి. నిద్ర జోల పాట పాడాలి.
- బెడ్ రూమ్ కదా అని బెడ్ ని గది మధ్యలో వేయకండి ఎప్పుడూ బెడ్ కిటికీ పక్కగా ఉండాలి. చల్లని గాలి పలకరిస్తూ ఉండాలి.
- ఆ కిటికీ దగ్గర మల్లె తీగను కాని, night queen గాని బయట పాకించారనుకోండి. గది అంతా పరిమళాలు వ్యాపిస్తాయి.
- గోడకి సముద్రం ఉన్నట్లు paint వేయించుకుంటే సముద్రం పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది. లేదా సముద్రం ఉన్న వాల్ పేపర్ అయినా పర్వాలేదు.
- బెడ్ రూమ్ లో roof కి artificial sky అమర్చుకుంటే రాత్రి పూట light ఆర్పగానే చుక్కలు చంద్రుడు ప్రత్యక్షమై మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి చూస్తూ హాయిగా నిద్రపోవచ్చు
- గదిలో ఒక పక్కగా table, దాని మీద tape recorder, ఒక వైపు మీ జంట photo ఉంటే, చక్కని సంగీతం వింటూ నిద్రపోవచ్చు. ఎప్పుడైనా మీరొక్కరే ఉంటే మీ partner ని గుర్తు చేస్తుంది.
- గదిలో ఇంకొక పక్క చిన్న shelf, అందులో మీకు ఇష్టమైన కొన్ని books పెట్టుకుంటే నిద్ర రాకపోతే చదువుకోడానికి బాగుంటుంది. కొంతమందికి book చదువుతూ నిద్రపోయే అలవాటు ఉంటుంది కదా.
- ఒక వైపుగా డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే, బెడ్ రూమ్ అందంగా ఉంటుంది.
- ప్రణయానికి ప్రతిరూపమైన రాధాకృష్ణ ఫోటోని wall hanger గా తగిలించండి.
- bed light ఎరుపుది కాకుండా ఉండాలి. తెలుపు, లేత పసుపు, లేత పచ్చ, లేత నీలం baby pink ఇలాంటి color అయితే బెడ్ రూమ్ ఆకర్షణీయంగా ఉంటుంది. బెడ్ bulb మీద రెండు మూడు చుక్కలు Scent చల్లితే నెమ్మదిగా గది అంతా సువాసనలు వ్యాపిస్తాయి.
- Matching pillows తో నలగని bed sheet తో bed ఉంటే చూడటానికి శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. గుమ్మాలకీ, కిటికీలకీ matching curtains ఉంటే అందంగా ఉంటుంది. bed పక్కనే కింద మరియు bed room door దగ్గర కాళ్ళు తుడుచుకునే పట్టా తప్పని సరిగా ఉండాలి. అప్పుడు bed room, bed రెండూ శుభ్రంగా ఉంటాయి.

Ladies Club (Living Room Decoration)
ఆల్ ఇన్ ఆల్ రూమ్
హాలు అనండి ముందు రూము అనండి. డ్రాయింగు రూము అనండి. ఏదైనా ఇదే !
- గదిలోకి రాగానే ఆహ్వానిస్తున్నట్లు ఒక WELCOME BOARD ఉండాలి. దానికి అటు పక్క ఇటు పక్క మీ ఇద్దరి ఫోటోలు తగిలించండి. అంటే మీ ఇద్దరు కలిసి వచ్చిన వాళ్ళని ఆహ్వానిస్తున్నట్లు అన్నమాట. వాళ్ళు వచ్చిన క్షణం లో మీరు ఎదురుగా ఉండలేరు కదా మరి! ఒక్కొక్కసారి అనుకోకుండా అతిధులు వస్తారు కదా . అలాంటప్పుడు వారికీ మీ ఇద్దరు ఆహ్వానం పలికినట్లు ఉంటుంది. వచ్చిన వాళ్ళ మనసులో తెలీకుండానే ఒక రకమైన సంతోషం కలుగుతుంది.
- గోడకి నిజంగానే అది వనమేమో అనిపించేలా ప్రకృతి సౌందర్యం ఉండే ఒక సీనరి (SCENERY) ని తగిలించండి లేదా అంటించండి.
- గదిలో ఎక్కడో ఒక చోట ఫ్లవర్ వాజ్ (FLOWER-VASE) ఉంటె బాగుంటుంది. అందులో ఎప్పటికప్పుడు తాజా పూలు ఉంచితే అందరి మనసులని ఆహ్లాదపరుస్తాయి. ఒకవేళ ప్లాస్టిక్ పూలు పెట్టినా కూడా అందంగా సహజంగా ఉందేవాటిని పెట్టండి.
- సోఫానా ,కుర్చీలా అన్నది కాదు ముఖ్యం. ఏది వాడినా ఒకే రంగులో ఉండేలా చూస్కుని అందంగా అమర్చుకుంటే చాలు.
- ఏ వస్తువు ఉన్నా లేకపోయినా ఇప్పుడు ప్రతి ఇంట్లో టి.వి తప్పనిసరిగా ఉంటుంది. టి.వి పైన పెన్ స్టాండ్ (penstand) పెట్టుకోవచ్చు. red and blue pens పెట్టుకుంటే అందంగా ఉంటుంది. అవసరానికి కూడా ఉపయోగపడుతుంది. మీకు పెన్ స్టాండ్ పెట్టుకోవడం నచ్చకపోతే ఇంకేదైనా అందంగా ఉండే ఫోటో ఫ్రేం పెట్టుకోండి. అందులో మీ ఇద్దరి ఫోటో లు మాత్రమే ఉండేలా చూస్కోండి.
- కార్నర్స్ లో కానీ , క్రింద కానీ , 3 అరల స్టాండ్ పెట్టండి. పై దాని మీద ఫోన్ , రెండవ అరలో అడ్రెస్ బుక్ , మూడవ అరలో లెటర్ పాడ్ పెట్టుకోండి. అంటే అది కేవలం ఫోన్ కి సంబంధించినది మాత్రమే అయి ఉండేలా చూస్కోండి. ఇక దాని మీద ఇంకా ఏది పెట్టి ఇరుకు చేయకండి.
- ఒక పక్కగా తాళాలు (keys) తగిలించుకోడానికి ఒక షో పీస్ (showpiece) పెట్టుకోండి. పియానో లేక తాళం ఆకారం లో మార్కెట్ లో సులభంగా దొరుకుతాయి.
- మరొక వైపు ఉత్తరాలు పెట్టుకోవడానికి ఒక స్టాండ్ లేదా సంచి , అందులో రంగురంగుల డిజైన్స్ లో పలకరిస్తున్న గ్రీటింగ్స్ ముచ్చట గొలిపేలా అమర్చండి.
- ఒక ములగా మూత ఉన్న డస్ట్ బిన్ పెట్టుకోవాలి. అందులో హాల్ కి సంబంధించిన డస్ట్ మాత్రమే వేయండి. కిచెన్ డస్ట్ అందులో వేయకండి. దుర్వాసన వస్తుంది కిచెన్ లో వేరేగా డస్ట్ బిన్ ఏర్పాటు చేస్కొండి. ప్రతి రూం లో ఒక డస్ట్ బిన్ చిన్నది ఏర్పాటు చేస్కుంటే శుభ్రంగా ఉంటాయి రూమ్స్ అన్ని. పనిమనిషికి లేదా మనకి కూడా సులభంగా ఉంటుంది ఇల్లు శుభ్రం చేస్కొడానికి.
- కార్పెట్ పరుచుకుంటే గదికి మరింత అందం వస్తుంది. డార్క్ కలర్స్ లో ఉండే కార్పెట్స్ అయితే దుమ్ము ధూలి పడిన అంత తొందరగా కన్పించడు , మాసిపోదు. వీలున్నంత వరకు మెత్తగా ఉండే కార్పెట్స్ అయితే కాలు పెట్టగానే హాయిగా అనిపిస్తుంది.
Subscribe to:
Posts (Atom)











