ఆకలిదప్పుల నడుమ తనువు పడెను రోగాల బారిన,
పులిసిన పుండ్లతో జీవితం నిలిచెను దుక్క సాగరాన !!
కార్చుటకు కన్నీరె మిగలక రక్తదారలు కారుచుండె,
కటిక దరిద్రాన్ని చూడలేక ప్రాణాలె పొవుచుండె !!
అపన్న హస్తలుంటాయని ఎదురు చూసిన ఈ ప్రాణం,
నీరసించి పోయి ఇక నిలవనంది ఈ రోజు !!
కనురెప్పల మాటున కన్నీటి అలలు ఆగిపోయె,
దాని వెనక ఉన్న హ్రుదయ స్పందన వీగి పోయె..!!!
nice andi raki garu :)
ReplyDeleteraki rockzzzzzzz
ReplyDelete