Sunday, 4 November 2012

My Poetry (Usha) - మంటలు

మంటలు మంటలు మంటలు 
ఎర్రగ మండే ధగ ధగ మంటలు 
కాటిని  సైతం భయపెట్టే మంటలు 
కన్నీళ్ళకు  తల వంచని మంటలు 
కడుపుకు మిగిలే కోతల పంటలు ..

తల కిందనే ఉన్నది  దీపం 
ఐనా విచిత్రం అంతా అంధకారం 
ఎటు పోవాలో ఏం  చేయాలో 
జీవిని ఎలా తిరిగి రప్పించాలో 
ఏమీ తెలియని అయోమయంలో
ఏది తోచని అసహాయతలో 
కాళ్ళని కడిగి కాటికి పంపి 
బంధాలు అనుబంధాలు 
మిగిలిన జీవిత మధుర క్షణాలు 
అన్నీ .. అంతా .. మంటలకర్పించి 
వెనక్కి చూడక ఇంటికి వస్తే  ..

కనిపించే ఈ విషాదం వినిపించే ఆ నిశ్శబ్దం 
స్మశానమా ఇల్లా ఇది అని  అనిపిస్తుంటే
పది నెలలు మోసిన పొత్తికడుపు 
పొగిలి పొగిలి దుఃఖిస్తుంటే  
ఉండలేని ఉసురుని  ఊరుకోబెడుతూ 
ఏవేవో గుర్తు చేసే మనసుని మందలిస్తూ 
క్షణ క్షణానికి ఎగసే  ఏడుపులని ఎదిరిస్తూ 
నిర్దాక్షిణ్యమైన కాలానికి నిస్సహాయంగా సహకరిస్తూ 
నిట్టూర్పులతో నిలబడిపోయిన  ఈ జీవచ్ఛవానికి 
కట్టెల్లో దాక్కుని కాటికి చేరిన ఆ మృతజీవికి 
తేడా ఏముంది?  జీవం  తప్ప ...
                                            ...... ఉష :)

4 comments:

  1. superrrrrrrrrrrrrrrrrrrrrrr chinna :) U r gr8 .... indulo no doubt

    ReplyDelete
  2. akka mantalu daga daga manddunu ne kavitha ma manasulu dochunu superb

    ReplyDelete
  3. chala bagundi pinni

    ReplyDelete