Wednesday, 10 October 2012

Ladies Club (Going to a Party)



పార్టీ కి వెళ్ళేటప్పుడు...?
       ఈ రోజుల్లో పార్టీ అనే మాట, పార్టీలకు వెళ్ళడం అనే మాట సర్వ సాధారణమై పోయింది. కిట్టీ పార్టీలు, Office లో పార్టీలు, friends తో బయట పార్టీలు, new year, valentine's day లాంటి occassions కి పార్టీ లు, పెళ్ళిళ్ళు, చిన్న చిన్న function లు ఇలా ఈ రోజుల్లో ప్రతి చిన్న, పెద్ద సందర్భానికి పార్టీ జరుపుకోవడం అనేది అలవాటుగా మారిపోయింది. మనం వెళ్ళే ప్రతీ పార్టీ లో మనం Centre of Attraction అవ్వడానికి ఇష్టపడతాం.దీనికోసం ఆడవాళ్ళకి ఏ చీర కట్టుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా అలంకరించుకోవాలి అనేవి ఒక పెద్ద సమస్య. దానికోసం ఇలా ఒకసారి ఆలోచిద్దాం.
  • పార్టీ అనగానే అందరూ భారీ బట్టలతో, భారీ make up తో వస్తారు అనేది వాస్తవం. దానికి భిన్నంగా మీరు simple గా ready అయి వెళితే Centre   of Attraction మీరే అవుతారు. Ready అవ్వాలి కాని Ready అయినట్టు కనపడకూడదు.
  • మన శరీరం మీద ఉన్న అలంకరణ కంటే మన పెదవుల మీద ఉండే  చిరునవ్వే అందర్నీ ఆకర్షిస్తుంది అనేది మర్చిపోకూడదు.
  • Centre of Attraction అవ్వాలి అంటే పెద్ద పెద్దగా అరుస్తూ, అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ అందరితో గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉండటం కాదు.మీరు తక్కువ మాటలు మాట్లాడినా, అందులో ఆప్యాయత, పనికోచ్చే విషయం ఎక్కువ ఉండాలి. అప్పుడు automatic గా అందరికి మీరు గుర్తుండిపోతారు.
  • ఒకవేళ పార్టీ కి ఏదైనా బహుమతి తీసుకు వెళ్ళాల్సి వస్తే దానిని బయట కొనే కంటే, కొద్దిగా సమయం కేటాయించి, ఆ బహుమతి తీసుకునే వారి ఇష్టా ఇష్టాలను దృష్టిలో పెట్టుకొని మీరే స్వయంగా తయారు చేస్తే, దానికి వచ్చే గుర్తింపే వేరు.ఆ బహుమతిని చూసినపుడు ఎదుటి వారి మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఇట్టే తెలిసిపోవాలి.
  • ఇలా ఉంటే ఎక్కడ పార్టీ జరిగినా గుర్తు పెట్టుకొని first invitation మీకే ఇస్తారు.

No comments:

Post a Comment