Wednesday, 10 October 2012

Ladies Club (Personal Beauty)


ఇల్లాలికి అందం చిరునవ్వే
కష్టపడి లేదా ఇష్టపడి ఇంటిని శుభ్రంగా, అందంగా ఉంచుకుంటే చాలదు. ఆ ఇంటి ఇల్లాలు కూడా శుభ్రంగా, అందంగా ఉండాలి. అందమంటే భారీ makeup తో కొత్త బట్టలు కట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. మనం పాత చీర కట్టినా, ఎంత Simple గా ఉన్నా, మన పెదవుల మీద చిరునవ్వు కదలకుండా ఉంటే  మన అంత అందంగా ఎవరూ కనపడరు. ఆ చిరునవ్వే మన ఇంట్లో వాళ్ళని, అథిదులని చక్కగా అలరించి సంతోష పెడుతుంది. అలాంటి చిరునవ్వుని ఎప్పుడూ మన పెదవుల మీద ఉంచుకోవాలంటే మనం ఈ చిన్న జాగ్రతలు తీసుకుంటే చాలు. 

  • ఈ రోజుల్లో nuclear families అవ్వడం వలన ఇంటి పని అందుకోవడానికి ఇంట్లో ఎవరూ ఉండరు. అందువల్ల పని అంతా మనం ఒక్కరమే చేసుకోవాల్సి వస్తుంది. దాని వలన అలసట వచ్చే మాట నిజమే కానీ ఎవరైనా వచినపుడు ఆ అలసటని కొంచెం పక్కన పెడితే చాలు. పని చేసేటప్పుడు చక్కని సంగీతం వింటూ చేస్తే పని అలసట అంతగా తెలీదు. ఎంత అలసటైనా శరీరానికే కానీ మనసుకి, పెదవులకి కాదు అనే విషయం గుర్తుంచుకుంటే చాలు. అవి ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాయి. 
  • ఎదుటి వారిలో మనకి చెడు కనిపిస్తున్నా సరే దాన్ని పక్క్కన పెట్టి మంచిని వెతికే ప్రయత్నం చేస్తే మన మనసు కష్టపడకుండా ఉంటుంది. మనసులో ఏ కష్టం లేనపుడు నవ్వుతూ ఉండటం సులభం కదా. అందుకే చెడు మనుషులకు, చెడు ప్రవర్తనలకు దూరంగా ఉండాలి.
  • ఇలాలు అంటేనే ఓర్పు కి మంచితనానికి మరొక పేరు కాబట్టి ఒక వేళ  ఎదుటి వారు మీరు చేయని తప్పుకి కుడా మిమ్మల్ని నిందిస్తుంటే చిరునవ్వే సమాధానం అవ్వాలి తప్ప వాదించి మనసు కష్ట పెట్టుకోవద్దు, సమయం వృధా చేసుకోవద్దు.
  • మన ఏ చిన్న సంతోషాన్ని అయినా ఇంట్లో  అందరితో పంచుకుంటే నవ్వులు ఇంకెక్కడికీ వెళ్ళవు. అలాగే ఎదుటి వారు ఎవరైనా తమ కష్టాలని చెప్పుకోవాలని వచ్చినపుడు, నవ్వుతూ వారిని ఆహ్వానిస్తే, వారి మనసులో మీరు కలకాలం ఉండిపోతారు. 
  • చివరిగా ఒక చిన్న సలహా... మనసును ఎప్పుడూ స్వచ్చంగా ఎలాంటి అరమరికలు లేకుండా ఉంచుకోండి. పిల్లలతో వీలైనంత సమయం గడపండి.ఇలా చేస్తే మనసుకి హాయిగా తేలిగ్గా అనిపిస్తుంది. మనసు తేలిగ్గా ఉంటె పెదవులు కూడా తేలిగ్గా నవ్వుతాయి. 

No comments:

Post a Comment