Thursday, 11 October 2012

My Poetry (Telugu - Usha)-ప్రేమికుల రోజు

ప్రేమికుల రోజు 
మమతానుబంధాలు పెనవేసుకున్నహృదయ మందిరాన 
ప్రేమజ్యోతి కాంతులు వెళ్లివిరిశాయి
అందమైన తారామణులు నిండి ఉన్నగగన మంటపాన 
చందురుడి వెలుగులు దివ్వెలై మెరిసాయి.

చెలియ కనుచూపే స్వర్గ సౌఖ్యమనుకునే ప్రియునికి 
సఖుడి పలకరింపే జీవన పరమార్థమానుకునే ప్రియురాలికి 
నిండు పౌర్ణమి నాటి వెండి వెన్నెల అనుభూతి ఈ రోజు.
ప్రణయం నిండిన హృదయాన అమృతం కురిపించే ప్రేమికుల రోజు.

అవధులు లేని ఆనందానికి, అంతులేని సంతోషానికి,
అనిర్వచనీయమైన అనుభూతిని, అజరామరమైన ఖ్యాతిని,
అవనిని సైతం గెలిచే ఆత్మవిశ్వాసాన్ని,
ఆకాశాన్ని ఆక్రమించగలిగే మనో నిబ్బరాన్ని, అందంగా అలవోకగా 
అందించే ప్రణయ వారథికి వందనాలు
ప్రేమైక జీవన సౌందర్యాన్ని అత్యద్భుతంగా 
అద్వితీయంగా అనుభవిస్తున్న వేలాది 
ప్రేమైక హృదయాలకివే కోట్లాది ప్రమాణాలు.

కావాలి ఈ ఆనందం శాశ్వతం 
అవ్వాలి ఈ జ్ఞాపకం మధురాతిమధురం 
ఎప్పటికీ .....ఎన్నటికీ .....
సూర్యచంద్రుల సాక్షిగా - ప్రేమికుల ఆత్మసాక్షిగా.

Life is beautiful. Love is more beautifulenjoy both to the core...

No comments:

Post a Comment