కమ్మని సంగీతంతో కాలింగ్ బెల్
అతిధులు మన ఇంటికి వచ్చినప్పుడు ముందుగా కాలింగ్ బెల్ నొక్కుతారు. మనం ఇంట్లో ఏదో పనిలో ఏదో గదిలో ఉంటాం కాబట్టి వచ్చి తలుపు తీయడానికి కనీసం రెండు నిమిషాలన్నా .పడుతుంది. ఆ రెండు నిమిషాలు కూడా అతిధులకి ఆనందాన్ని ఇవ్వవలసిందేగా మరి! కాలింగ్ బెల్ వచ్చిన వారితో కాసేపు కబుర్లు చెప్పాలి. దీని కోసం ఒక మంచి పాత లేదా ఒక చక్కని సంగీతం వారికి వీనుల విందు చేసే ఏర్పాటు చేయాలి. ఆ సంగీతాన్ని అనుభవిస్తూనే గుమ్మాన్ని కూడా గమనిస్తారు కాబట్టి దాన్ని కూడా చక్కగా అలంకరించి ఉండాలి ఎప్పుడూ.
ఇది ఉదాహరణ మాత్రమే . మనకు ఉన్న సమయాన్ని బట్టి మనం అందంగా అలంకరించుకుంటే చాలు.
No comments:
Post a Comment